భారతదేశం, జూలై 29 -- హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) పరిధిలోని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (CSE-RCA) ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 12 వరకు పొడిగించినట్లు వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళా అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని CSE-RCA డైరెక్టర్ ప్రొఫెసర్ హెచ్. అలీమ్ బాషా తెలిపారు.

దరఖాస్తు గడువు పొడిగింపు నేపథ్యంతో పాటు ఎంట్రన్స్ పరీక్ష తేదీలలో కూడా మార్పులు చేశారు. రాత పరీక్ష (ఎంట్రన్స్ టెస్ట్) ఆగస్టు 16న నిర్వహిస్తారు. వ్యాసరూప పరీక్ష, ఇంటర్వ్యూలు ఆగస్టు 24 నుండి 28 వరకు జరుగుతాయి. ఆసక్తి కలిగిన అభ్య...