భారతదేశం, మే 28 -- గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఒక కీలక భేటీని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీనియర్ మంత్రివర్గ సహచరులతో అల్పాహార విందు (Breakfast Meeting) లో పాల్గొన్న ముఖ్యమంత్రి, తన నిర్ణయాన్ని వారితో పంచుకున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే, ఆయన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కె. పట్టన్ మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా చేయనున్నారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం 100 శాతం ఖాయం" అని స్పష్టం చేశారు. మరో సీనియర్ నేత ఆర్.వి. దేశ్‌పాండే కూడా సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయాన్ని ధృవీకరించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సిద్ధరామయ...