భారతదేశం, సెప్టెంబర్ 15 -- హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అందరూ చూస్తుండగానే ఓ ముఠా వెంటాడి వేటకొడవళ్ళు, రాడ్లతో దాడి చేసి ఓ వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో, ప్రత్యక్ష సాక్షుల ఫోన్లలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన మహమ్మద్ నహీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. అయితే కాలక్రమేణా వీరిద్దరూ నేర ప్రవృత్తికి అలవాటుపడి రౌడీషీటర్లుగా మారారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు క...