భారతదేశం, సెప్టెంబర్ 28 -- వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవాన్ని తెస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2014-19 టీడీపీ పాలనను మత్స్యకార సమాజానికి స్వర్ణయుగంగా అభివర్ణించిన మంత్రి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మళ్లీ అదే కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గతంలో రూ.4,000 వేట నిషేధ భృతి ఇచ్చమన్నారు.

మత్స్యకారులు చేపల కదలికలను ట్రాక్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి కేంద్ర సహాయంతో పడవల్లో రూ.4,000 ఖరీదు చేసే ఉపగ్రహ ట్రాన్స్‌పాండర్‌లను అమర్చుతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ10 లక్షల పరిహారం కోసం జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) బీమా పథకంలో ఆంధ్రప్రదేశ్ చేరుతుందని కూడా ప్రకటించారు.

సహకార డెయిరీలలో...