మత్స్యకారుల కోసం గాలింపు మరింత వేగవంతం చేయండి : చంద్రబాబు
భారతదేశం, ఆగస్టు 18 -- ఆగస్టు 3వ తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లే క్రమంలో అదృశ్యమైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర మత్స్యశాఖ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ అన్వేషణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఆగస్టు 3వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ జెట్టీ నుంచి పడవలో సముద్ర వేటకు వెళ్లారు. అయితే వారు బయలుదేరిన కొద్దిసేపటికే అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా వీరు ఆగస్టు 12వ తే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.