భారతదేశం, మే 26 -- చాలా మంది ఇళ్లల్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి, ఆర్థిక బాధల నుంచి, కలహాల నుంచి, దిష్టి బాధల నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు సంతోషంగా ఉండడానికి, అదృష్టం పెరగడానికి కొన్ని పరిహారాలను చూద్దాం. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సమస్యలను చిటికెలో తొలగిస్తాయి.

ఏడు చింతపిక్కలను తీసుకుని ఎక్కడైనా చీమలు పట్టే చోట వాటిని వేయండి. చీమలు తినే కొద్దీ దిష్టి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు మీ చేతికి వస్తుంది.

మంగళవారం కొంచెం చింతపండును ఎవరూ తిరగని చోట, నిర్మానుష్య ప్రదేశంలో వేయండి. దీంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.

హుండీలో 7 రూపాయలు వేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆరోగ్యంగా ఉండ...