భారతదేశం, సెప్టెంబర్ 28 -- మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీపంలోని నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై ఆటో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్రి మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామస్తులుగా గుర్తించారు.

ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది ఆటో. మృతిచెందినవారు సౌందర్య, రమ్య, రవళి.. ముగ్గురు యువతులు మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నారు. రోజులాగే ఉదయం విధుల్లోకి వెళ్లడానికి ఆటోలో బయల్దేరుతారు. మార్గమధ్యంలో నస్పూర్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది.

ఆటోకు బైక్ అడ్డు వచ్చింది. బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్. వాహనాన్ని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింద...