భారతదేశం, అక్టోబర్ 27 -- మంగళవారం అంటేనే సంకటమోచనుడు, భక్త ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ పవిత్ర దినాన స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే సకల భయాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని ప్రగాఢ నమ్మకం.

ఇక గ్రహాల కదలికలు, నక్షత్రాల గమనం ఆధారంగా నేటి రాశి ఫలాలు ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకు రాబోతున్నాయో పరిశీలిద్దాం. నేడు కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

మేష రాశి వారికి నేడు ఆర్థిక వ్యవహారాల్లో అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అయితే ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

ఈ రాశి వారు భాగస్వామితో బహిరంగంగా మాట్లాడి బంధాన్ని మరింత దృఢంగా మార్...