భారతదేశం, మార్చి 24 -- మంగళవారం నాడు హనుమంతుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. మంగళవారం నాడు హనుమంతుని అనుగ్రహం పొందడానికి చాలా ఉత్తమమైన రోజు. ఈ రోజు హనుమంతుడిని పూజించేటప్పుడు సుందరకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, ఆ తర్వాత ధ్యానం ప్రారంభించాలి.

పూజ గదిలో హనుమంతుడి ఫోటోను లేదా విగ్రహాన్ని ఆరాధించి, ఆ తర్వాత సుందరకాండ పఠించాలి. హనుమంతుడు ముందు సీతారాముల ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టేటట్టు చూసుకోండి. సింధూరంతో హనుమంతుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. సుందరకాండ పారాయణానికి ముందే వినాయకుడిని పూజించి, ఆ తర్వాత సుందరకాండ పారాయణం చేయండి.

హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. మంగళవారం నాడు సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి రామ న...