భారతదేశం, జూలై 31 -- భోగపురం విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆగస్టు 17న ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అక్టోబర్ 24 వరకు తన విమాన షెడ్యూల్‌ను ప్రకటించింది. హైదరాబాద్-భోగపురం మధ్య ప్రతిరోజూ ఐదు సర్వీసులను, బెంగళూరు-భోగపురం మధ్య ప్రతిరోజూ రెండు సర్వీసులను నడపనుంది. దీంతోపాటుగా అదనంగా వారంలో ఐదు రోజులు (ఆదివారాలు, శుక్రవారాలు మినహా) ఒక సర్వీసును నడుపుతామని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. విజయవాడ, భోగపురం మధ్య ప్రతిరోజూ నాలుగు సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర

అభివృద్ధ...