Telangana,ranagreddy, ఆగస్టు 19 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లులో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న చింతకింది లలిత ఏసీబీకి చిక్కారు. ఆమెతో పాటు సర్వేయర్ కోట రవి కూడా ఉన్నారు.

అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయాన్ని సంప్రదించాడు. ఇందుకోసం అతని వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి. ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే రూ. 50 వేలు తీసుకున్న ఎమ్మార్వో. మరో రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ కోట రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడి...