భారతదేశం, మార్చి 3 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో విష్ణువు విగ్రహం బయటపడింది. నిజానికి ఈ విగ్రహం మూడు సంవత్సరాల కిందటే కనిపించింది. అప్పట్లో చేపలు పట్టేందుకు వెళ్లినవారు చూశారు. కొన్ని రోజులు పూజలు చేశారు. తర్వాత అలాగే వదిలేయడంతో ఇసుకలో కూరుకుపోయింది.

మళ్లీ ఈ ఏడాది తాజాగా కొన్ని రోజుల కిందట కొంతమందికి విగ్రహం తల భాగం కనిపించింది. దీంతో ఈ విషయం మరోసారి బయటకు వచ్చింది. విగ్రహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చింతకాని, జగ్గయపల్లి గ్రామస్థులు విగ్రహాన్ని బయటకు తీశారు. అయితే విగ్రహంపై రెండు గ్రామాల ప్రజల మధ్య చర్చ నడిచింది. విగ్రహం తన చేను దగ్గరలో బయట పడిందని, ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తానని ఓ రైతు చెప్పాడు. ఈ విగ్రహ రూపాన్ని బట్టి కాకతీయుల కా...