భారతదేశం, జూన్ 22 -- Bhongir Fort Ropeway Project : చారిత్రాత్మక భువనగిరి కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోటపై నిర్మిస్తున్న రోప్‌వే, హోటల్, పార్కింగ్ వసతులు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫెటేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, పర్యాటకులకు అవసరమైన ఇతర వసతుల పురోగతిని అధికారులతో కలిసి సోమవారం సమీక్షించారు.

కోట వద్ద సాగుతున్న పనులన్నింటినీ రాబోయే అక్టోబర్ 2వ తేదీ (గాంధీ జయంతి) నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అవసరమైతే రాత్రింబగళ్లు (24 గంటలు) షిఫ్టుల వ...