భారతదేశం, మే 1 -- Hyderabad techie Seetharam suicide Case : హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసును బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య రేణుక వ్యవహరించిన తీరుతోనే సీతారాం రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి(36) మృతదేహం హుస్సేన్ సాగర్ లో లభ్యమైంది. తొలుత సాధారణ ప్రమాదం లేదా ఆత్మహత్యగా భావించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు. కోడలు రేణుకపై తీవ్ర ఆరోపణలు చేయడంతో కేసును బాచుపల్లి పోలీసులకు బదిలీ చేశారు. సీతారాం తండ్రి వెంకటేశ్వర్ ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

2018లో వివాహం చేసు...