భారతదేశం, మే 30 -- మన భారతీయ సంప్రదాయంలో రోజ్ వాటర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. సౌందర్య సాధనంగానే కాదు, ప్రశాంతత, సానుకూల శక్తికి చిహ్నంగా కూడా భావిస్తాము. దీనిని ఉపయోగించడం వలన పరిసరాలు పవిత్రంగా మారుతాయి. ప్రతికూల శక్తి ప్రభావం తగ్గి, సానుకూల శక్తి ఏర్పడుతుంది.

ఎప్పుడైతే ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో, అప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. బంధం మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కూడా తగ్గిపోతాయి. విడిపోయిన బంధాలు మళ్లీ చిగురిస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలా? దంపతుల మధ్య గొడవలు, సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ రోజ్ వాటర్ పరిహారాలను పాటిస్తే సరి.

శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి రోజ్ వాటర్‌ను చల్లండి. ఇది చాలా శుభప్రదమైనది. అభిషేకం తర్వాత ఆ పన్నీరును ఇంటి నలుమూలలా చల్లండి. ఇలా చేయడం వలన స...