భారతదేశం, జనవరి 22 -- భార్యకు భరణం (Maintenance) చెల్లించడం నుంచి తప్పించుకునేందుకు సింగపూర్‌లో భారీ వేతనం లభించే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ కెనడియన్ వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఉద్యోగం మానేసినప్పటికీ, ఆర్థిక బాధ్యతలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసిన ఫ్యామిలీ కోర్టు.. భార్యాపిల్లల పోషణ నిమిత్తం బకాయిల కింద 6,34,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.5 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

కోర్టు పత్రాల ప్రకారం.. కెనడాకు చెందిన ఈ దంపతులు నలుగురు పిల్లలతో కలిసి 2013 డిసెంబర్‌లో సింగపూర్‌కు వచ్చారు. సదరు వ్యక్తి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. 2023 నాటికి అతడి వార్షిక ఆదాయం 8,60,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 6 కోట్లు) పైమాటే. భార్య గృహిణి కాగా, పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదువు...