భారతదేశం, జూన్ 3 -- భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే మంచి కమ్యూనికేషన్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నమ్మకం, అలాగే మధ్య మధ్యలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా అవసరమే. మన ప్రేమను కొన్నిసార్లు మాటలతో చెప్తే, మరి కొన్నిసార్లు బహుమతుల ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రేమిస్తున్నామనేది బహుమతుల ద్వారా చెప్పినప్పుడు వారు ఎంతో సంతో షపడతారు.

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, సంతోషం వెల్లివిరిసినప్పుడే ఆ సంసారం ఆనందంగా, స్వర్గంలా మారుతుంది. ఒక్కోసారి జాతకంలో గ్రహాల స్థితి అనుకూలంగా లేకపోయినట్లయితే దంపతుల మధ్య చిన్నచిన్న విభేదాలు, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నవగ్రహాల్లో ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ, దాంపత్య సుఖానికి అధిపతి శుక్ర గ్రహం.

జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. భ...