Telangana, ఆగస్టు 13 -- తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో రేపు పలు జిల్లాల్లోని బడులకు సెలవులు ప్రకటించారు.

రేపు(ఆగస్ట్) జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆగస్ట్ 13, 14 తేదీల్లో ఒంటిపూట పాఠశాలలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని అన్ని రకాల పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా డీఈవో ఓ ప్రకటన విడుదల చేశారు.

రేపు (ఆగస్ట్ 14) మెదక్, సంగారెడ్డి...