భారతదేశం, ఆగస్టు 20 -- దేశ ఆర్థిక రాజధాని ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 24 గంటల్లో ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. పలు రైల్వే లైన్లు నీటిలో మునిగిపోవడంతో ముంబైకి జీవనాడిగా పిలిచే లోకల్ రైళ్లకు కూడా బ్రేక్ పడింది. పలు చోట్ల లోకల్ రైళ్లను నిలిపివేశారు.

సియోన్-కుర్లా, సీఎస్ఎంటీ-కర్జాత్ మార్గాలను మూసివేశారు. ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైకోర్టు భవన ఆవరణలోకి కూడా నీరు చేరింది. రానున్న 48 గం...