భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్: పసిడి ప్రియులకు, పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలు కొనాలనుకునే సామాన్యులకు ఊరటనిచ్చే వార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 18న) బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పసిడి ధర 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరువలో కదలాడుతుండగా, వెండి సైతం వరుస నష్టాలను మూటగట్టుకుంది. ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,540 తగ్గగా, వెండి కిలోకు ఏకంగా రూ.4,940 మేర దిగొచ్చింది.

సాధారణంగా భారత్‌లో నవంబర్ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. ఉదయం 9:06 గంటల గణాంకాల ప్రకారం, దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,32,300కు చేరింది. ఇక ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగ...