భారతదేశం, సెప్టెంబర్ 16 -- సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పెరిగి 82,380.69 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 170 పాయింట్లు ఎగబాకి 25,239.10 వద్ద స్థిరపడింది. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై సానుకూల వాతావరణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, అలాగే రూపాయి విలువ పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు బలం చేకూర్చాయి.

భారత, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కావడం మార్కెట్‌లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ముఖ్యంగా దక్షిణాసియా కోసం అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఢిల్లీ పర్యటనకు రావడం, వాణిజ్య ఒప్పందం గురించి చర్చించడం మార్కెట్‌కు సానుకూల సంకేతాలు పంపింది. దీనితో పాటు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడ్) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చనే అంచనాలు కూడా మదుపరుల విశ్వాసాన్ని పెంచాయి. అమెరికా డాలర్‌తో పోలిస...