భారతదేశం, డిసెంబర్ 17 -- టెక్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో తన 12 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నేడు ఒక భారీ ఈవెంట్‌కు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో OnePlus 15R, అలాగే OnePlus 15R Ace Edition స్మార్ట్‌ఫోన్లను కంపెనీ లాంచ్ చేయనుంది. వీటితో పాటు OnePlus Pad Go 2 కూడా గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

ఈ మెగా లాంచ్ ఈవెంట్ నేడు (డిసెంబర్ 17) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

ధరల విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంచనా సమాచారం ప్రకారం:

12GB + 256GB మోడల్: రూ. 47,000 నుండి రూ. 49,000 మధ్య ఉండవచ్చు.

12GB + 512GB మోడల్: రూ. 52,000 పైమాటే అని తెలుస...