భారతదేశం, జూన్ 18 -- ెనడాలో జస్టిన్ ట్రూడో పాలన ముగిసిన తర్వాత కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచడానికి వేగంగా కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా, కనన్స్కిస్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలకు అంగీకారం కుదిరింది.

దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి, కొత్త హైకమిషనర్‌ను నియమించడానికి భారత్, కెనడా అంగీకరించాయి. గత కొన్ని నెలలుగా భారత్‌తో కెనడా సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి పరిస్థితుల్లో దౌత్యవేత్తలు, హైకమిషనర్ల నియామకం సంబంధాలను మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు వేసే దిశంగా ఆలోచనలు జరిగాయి. జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కార్నీల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం కెనడా ప్రధాని కొన్ని నిర్ణయాలను ప్రకటించారు.

ఇరు...