భారతదేశం, మార్చి 24 -- పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారత్‌పై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా భారతీయులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు ఇప్పటికే మూడు వారాలు దాటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌కు ఈ పరిస్థితి ఎందుకు ఆందోళనకరంగా మారిందంటే:

యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని మోదీ వివరించారు.

"మేము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపు...