భారతదేశం, మే 9 -- Mercury Transit in Bharani 2026 : నవగ్రహాలలో బుద్ధికి, వ్యాపారానికి, వాక్కుకు కారకుడైన బుధ గ్రహం తన స్థానాన్ని మార్చుకుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. బుధుడు 2026 మే 7వ తేదీన భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, శుక్రుడు పరమ మిత్రులు.

మిత్రుడి నక్షత్రంలోకి బుధుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగ కాలం మొదలైంది. మే 13వ తేదీ ఉదయం వరకు బుధుడు ఇదే నక్షత్రంలో కొలువై ఉంటాడు. ఈ కొద్ది రోజుల సమయంలోనే బుధ-శుక్రుల అనుగ్రహంతో ఏయే రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా లాభపడనున్నారో ఇప్పుడు చూద్దాం.

భరణి నక్షత్రం మేష రాశి పరిధిలోకి వస్తుంది కాబట్టి.. ఈ సంచారం వల్ల మేష రాశి వారికి అత్యంత సానుకూల ఫలితాలు దక్కుతాయి. వీరి వ్యక్తిత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుం...