భారతదేశం, నవంబర్ 3 -- సైన్స్‌ ఫిక్షన్‌ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన 'ప్రిడేటర్' మూవీ సిరీస్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.

ఇప్పుడు అదే సిరీస్‌కి కొత్త రూపాన్ని ఇస్తూ "ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్" సినిమా రానుంది. నవంబర్‌ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడు అందరిని వేటాడే ప్రిడేటర్ ఈ సారి వలలో చిక్కుకుంటాడు.

అతన్ని ఎవరు బయట పడేశారు, ఎవరు కాపాడారు, ప్రెడేటర్‌తో పాటు తమను వెంటాడుతున్న వారిని వేటాడిన వ్యక్తి ఎవరు అనే అంశాలతో మరింత థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్‌ను తెరకెక్కిం...