భారతదేశం, అక్టోబర్ 19 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 414 పాయింట్లు పెరిగి 74,729 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 149 పాయింట్లు వృద్ధిచెంది 23,146 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 55,844 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,551.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,661.28 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 23,300 వద్ద అత్యంత కీలకమైన 50 ఈఎంఏ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చు. 22,200 జోన్ కీలక సపోర్ట్​గా ఉంది," అని ప్రభు...