భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఒకప్పుడు బ‌తుక‌మ్మ పండుగ‌ను బ‌తుక‌మ్మకుంట వ‌ద్ద ఉత్సాహంగా జ‌రుపుకొనేవారు. ప్రకృతితో మమేకమై పూల పండుగ‌ను ఎంతో ఘనంగా నిర్వహించేవారు. పసుపుతో చేసిన గౌరమ్మ, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, వాటిని నిమజ్జనం చేసేందుకు స్వచ్ఛమైన నీటితో నిండిన బతుకమ్మకుంట. ఒకప్పుడు అంబర్‌పేట ప్రజల జీవనంలో ఒక భాగం ఇది. కానీ కాలక్రమేణా, బతుకమ్మకుంట ఆక్రమణలకు గురై, చెత్తాచెదారంతో నిండిపోయింది. బ‌తుక‌మ్మ సంబురాల‌కు వేదికైన ఆ కుంట తన వైభవాన్ని కోల్పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక బతుకమ్మకుంటకు పూవ్వవైభ‌వం వ‌చ్చింది. బ‌తుక‌మ్మ ఉత్సవాలకు బ‌తుక‌మ్మకుంట మ‌ళ్లీ వేదిక‌కానుంది. అంబ‌ర్‌పేట‌కు ఆడ‌ప‌డుచుల‌కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం కానుంది. హైడ్రా ప్రత్యేక చొరవతో బ‌తుక‌మ్మకుంట మ‌ళ్లీ జీవం పోసుకుంది. రూ.7.40 కోట్ల వ్యయంతో చేపట్టిన ...