భారతదేశం, ఆగస్టు 6 -- బ్లాడర్ క్యాన్సర్ అనేది కేవలం పొగతాగేవాళ్లకే వచ్చే "స్మోకర్స్ డిసీజ్" అన్న అపోహను ఇక విడిచిపెట్టాలి. అవును, పొగతాగడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ - దాదాపు సగం కేసులకి ఇదే కారణం. కానీ... కేవలం దీని వల్ల మాత్రమే బ్లాడర్ క్యాన్సర్ వస్తుందనేది అపోహ. అసలింతవరకూ పొగ తాగని వాళ్లకి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన కలిగి ఉండడం, వ్యాధిని త్వరగా కనుగొనడం, నివారణా మార్గాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఎందుకంటే పొగతాగినప్పుడు, క్యాన్సర్ కారక విషపదార్థాలు, శరీరంలోకి వెళ్తాయి, అవి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి, మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. కానీ అవి బ్లాడర్‌లో కొంతకాలం నిల్వ ఉంటూ బ్లాడర్ కణాలని దెబ్బ తీయవచ్చు. దీని వలన క్యాన్సర్ మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం ఒక కారణం మాత్రమే. ...