భారతదేశం, జూలై 7 -- ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో బ్రిక్స్ సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా సభ్య దేశాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేశారు. బ్రిక్స్ దేశాల విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్పకుండా సుంకాల పెంపును విషయాన్ని బ్రిక్స్ గ్రూప్ ఖండించింది. దీనికి ప్రతిస్పందనగా ఆయన ఈ బెదిరింపు చేశారు. బ్రిక్స్‌లో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దైశానికైనా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు దీనిపై చైనా స్పందించింది....