భారతదేశం, ఆగస్టు 3 -- బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని ఎందుకు పండితులు, పెద్దలు చెబుతుంటారు? బ్రహ్మ ముహూర్తం విశిష్టత గురించి, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మన సనాతన ధర్మంలో బ్రహ్మ ముహూర్తాన్ని చాలా పవిత్రమైన కాలంగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆ సమయంలో దేవుడిని ప్రార్థించడం, యోగా చేయడం వంటివి చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చాలా మంచిదని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో మేలు జరుగుతుందని, చాలా విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు.

మనుషులు ఆ సమయంలో పూజలు ఎందుకు చేస్తారు? అవి ఎందుకు ప్రత్యేకమైనవి? అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ...