భారతదేశం, మే 22 -- బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని రేఖ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించినట్లుగా ఎవరికి వాళ్లు ఫీలవుతుంటారు. అయితే ఇందు వేసే తాజా ప్లాన్ దెబ్బకు రేఖ మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 22) ఎపిసోడ్ ఇంట్లో రాజు చేసే హంగామాతో మొదలవుతుంది. ఇంటి అల్లుడిని ఇలాగే చూసుకుంటారా అంటూ హడావిడి చేసే రాజు.. తనకు విశాలమైన గది, కింగ్ సైజ్ బెడ్, మంచి ఏసీ ఉండాలని డిమాండ్ చేస్తాడు. అది విన్న రేఖ మొదట భ్రమరాంబను గది ఇవ్వమంటుంది.

ఆమె ఒప్పుకోదు. తర్వాత స్వాతి రూమ్ తీసుకోమంటుంది. దానికీ భ్రమరాంబ అడ్డు పడుతుంది. చివరికి ఐశ్వర్య రూమ్ తీసుకొమ్మని అడుగుతుంది. దానికి ఐశ్వర్య నో అంటే.. రాజు మెల్లగా ఆమె గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేయడంతో సరే అంటుంది.

మరోవైపు వెంక...