భారతదేశం, ఫిబ్రవరి 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మంత్రి ధర్మేంద్రను తన గురించి నిజం చెప్పొద్దని వేడుకుంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి అప్పు, కల్యాణ్ వస్తారు. దాంతో రుద్రాణి వెళ్లి దాక్కుంటుంది. కావ్య, రాజ్ తన అక్క, బావలు అని అప్పు పరిచయం చేసుకుని మంత్రితో మాట్లాడుతుంది.

కన్న బిడ్డను చంపాలని రౌడీలను పంపిన మీరే వెంటనే మనసు ఎందుకు మార్చుకున్నారని అని అప్పు అడుగుతుంది. నేనే పాపం చేస్తున్నా అని రియలైజ్ అయ్యాను. అందుకే వద్దనుకున్నాను అని మంత్రి చెబుతాడు. మీ పాపకు ఆరోగ్యం బాలేకపోతే ఇంత పెద్ద పలుకుబడి ఉండి ఆపరేషన్ చేయించే ఛాన్స్ ఉంది. కానీ, బిడ్డలను మార్చాలని ఎందుకు అనుకున్నారు. అది మీకు వచ్చిన ఆలోచనేనా అని అప్పు అడుగుతుంది.

దానికి కూడా తనకే వచ్చిన ఆలోచన అని, ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అని, తర్వాత రాజ్, కావ్యలను చూసి తప్పు ...