భారతదేశం, ఫిబ్రవరి 10 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 952వ ఎపిసోడ్ లో తన తప్పు తెలుసుకున్న మంత్రి ధర్మేంద్ర రాజ్, కావ్యకు వాళ్ల సొంత కూతురిని అప్పగించి వాళ్ల కాళ్ల మీద పడతాడు. అయితే దీని వెనుక తాను ఉన్నానని ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్, కావ్యలకు తెలియకూడదని రుద్రాణి అనుకున్నా.. అనుకోకుండా అప్పుకి దొరికిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ రౌడీల నుంచి పాపను రాజ్ కాపాడే సీన్ తో మొదలవుతుంది. రాజ్ ను ఒకడు కత్తితో పొడవబోగా.. కావ్య అడ్డుకుంటుంది. అప్పుడే మంత్రి ధర్మేంద్ర అక్కడికి వస్తాడు. అతన్ని రాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తాడు.

సొంత కూతురినే చంపుకోవాలని చూస్తావా.. అసలు మనిషివేనా అని ప్రశ్నిస్తాడు. దీంతో మంత్రి పశ్చాత్తాపడతాడు. తన తప్పు తెలుసుకున్నానని, మీ కూతురిని తన స్వార్థం కోసం తీసుకుంటే.. మీరు మాత్రం తన సొంత కూతురి కో...