భారతదేశం, నవంబర్ 16 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో స్వప్న నాసిరకం చీర కట్టుకుని కిందకు వస్తుంది. అది చూసి ఏంటీ స్వప్న ఇలాంటి చీరలు నువ్వు కట్టవు, ఇప్పుడెందుకు కట్టావ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు ఈ చీర కట్టడం చాలా సంతృప్తిగా ఉందని కాస్టా కోపంగా సమాధానం ఇస్తుంది స్వప్న.

ఇప్పుడు ఏమన్నాను స్వప్న కోప్పడుతున్నావ్. ఇలాంటి చీరలు కట్టడమేంటీ అని అడిగా అంతేగా అని ధాన్యం అంటుంది. ఇది నా భర్త రాహుల్ కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బుతో కొనింది. దీనికంటే ఎంత కాస్ట్‌లీ చీర కట్టుకున్న సంతృప్తిగా ఉండదు అని స్వప్న అంటుంది.

ఏంటీ రాహుల్ కష్టపడి పని చేశాడా. అని తను చెబితే నువ్వు నమ్మావా. రాహుల్ కష్టపడి పనిచేసి నమ్మాడు అంటే మేము నమ్మం. ఎవరినైనా మోసం చేసి డబ్బులు కొట్టేశాడంటే నమ్ముతాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీపై విరుచు...