భారతదేశం, డిసెంబర్ 21 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పరాట కాల్చుకునే వ్యక్తి దుగ్గిరాల ఇంట్లోకి డైరెక్టర్ మణి వర్మగా ఎంట్రీ ఇస్తాడు. సినిమా కథలను జ్యూవెలరీ యాడ్ కాన్సెప్టులుగా చెబుతాడు. దాంతో అంతా కావ్యనే మంచి కాన్సెప్ట్ చెప్పమంటారు. తరతరాల నుంచి కుటుంబంలో బంధాలను పెంచుతున్న స్వరాజ్ జ్యూవెలరీ అనే కాన్సెప్ట్ చెబుతుంది కావ్య.

దానికి అంతా బాగుందని చప్పట్లు కొడతారు. డైరెక్టర్ మణి వర్మ మాత్రం యావరేజ్‌గా ఉందని, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీకు నచ్చిందే చేద్దామని అంటాడు. తర్వాత ఇంటిల్లిపాది నగలతో రెడీ అయి వస్తారు. గ్రీన్ మ్యాట్ దగ్గర అందరిని నిలబెట్టి షూటింగ్ చేస్తాడు ఫేక్ డైరెక్టర్.

డైరెక్టర్‌లా పెద్ద పోజులు కొడుతూ ఒక్కొక్కరి మొహాల్లో ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ హడావిడి చేస్తాడు. అందరిపై అరుస్తుంటాడు. ఏదోటి చె...