భారతదేశం, నవంబర్ 8 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు ఉదయం రాహుల్ డల్‌గా ఉంటే రాజ్ అడుగుతాడు. జరిగింది మర్చిపోకపోతే భవిష్యత్తుపై భయం ఉండదుగా అని స్వప్న సెటైర్ వేస్తుంది. కిచెన్‌లో కావ్యతో రాజ్ రొమాన్స్ చేస్తాడు. ఖాలీగా ఉండేబదులు ఆఫీస్‌లో పని చేసుకోవచ్చుగా అని రాహుల్‌తో అంటుంది ఇందిరాదేవి.

దానికి ఇక ఆ పనులు అయినట్లు అని సుభాష్ అంటాడు. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు. రాహుల్ ఎవరని అడుగుతారు. రాహుల్ లేచి నిల్చుంటే కానిస్టేబుల్స్‌తో అరెస్ట్ చేయమంటారు. ఏం చేశాడని రాజ్ అడిగితే.. మర్డర్ చేశాడని ఎస్సై చెబుతాడు. కుయిలి అనే అమ్మాయి చనిపోయింది, ఇతను కుయిలిని కొట్టడం వల్లే చనిపోయిందని ఆమె భర్త కేస్ పెట్టాడు, ఆధారాలతోనే అరెస్ట్ చేస్తున్నామని ఎస్సై అంటాడు.

నీకు కుయిలి తెలుసా, నీకు కుయిలికి గొడవ జరిగిందా, కొట్ట...