భారతదేశం, డిసెంబర్ 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు డ్యూటీ చేయడంపై ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. అందరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను దాని ఆరోగ్యం, క్షేమం కోసమే కదా వద్దన్నాను. జరగరానిది ఏమైనా జరిగిది పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నాను అని ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది.

మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కానీ, ఆ తల్లిని చూసి చలించలేకపోయాను. నేను కూడా తల్లి అవుతున్నా కదా అని అప్పు అంటుంది. నువ్ను నన్ను మోసం చేశావ్. చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. ఇక జీవితంలో అది పోలీస్ ఉద్యోగం చేయడానికి వీళ్లేదు. ఇంత జరిగాక దీన్ని క్షమించను. అప్పు శాశ్వతంగా జాబ్ మానేయాలి. జాబ్ రిజైన్ చేయాల్సిందే. నేను ముఖ్యమే జాబ్ ముఖ్యమో తేల్చుకో అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.

తర్వాత అప్పు బాధపడుతుంటే కావ్య, రాజ్ వచ్చి ఓదారుస్తారు. పాప విషయంలో నువ్వు చేసింది...