భారతదేశం, జూన్ 25 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కంపెనీలో ఉద్యోగుల మనసులు గెలుచుకున్న ఇందు.. ఇంట్లో రేఖ దగ్గర తెగ నటించేస్తుంది. అదే సమయంలో రాకేష్ బారి నుంచి ఐశ్వర్యను కూడా కాపాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (జూన్ 25) ఎపిసోడ్ కంపెనీలో ఉద్యోగులందరికీ ఇందు జీతాలు ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. దీంతో వాళ్లందరూ ఇందుకి కృతజ్ఞతలు చెబుతారు. అంతేకాదు ఆమె కాళ్లపై పడటానికీ వస్తారు. వాళ్లందరి మనసులు గెలుచుకున్న ఇందుని చూసి రేఖ, భూషణ్ షాక్ తింటారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని, అందరూ బాగా పని చేయాలని ఇందు చెబుతుంది. అందరం కష్టపడి పని చేస్తామని వాళ్లు హామీ ఇస్తారు.

ఇటు ఇంట్లో ఐశ్వర్య దగ్గరికి రాకేష్ మరోసారి వస్తాడు. ఎన్నిసార్లు అడి...