భారతదేశం, జూన్ 20 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు పీకల్లోతు కష్టాల్లో పడతారు. ఐశ్వర్య వాళ్ల కొంప ముంచుతుంది. మరోవైపు రాజును వెతుక్కుంటూ దుగ్గిరాల ఇంటికి వస్తారు చలపతి, లక్ష్మి. దీంతో అన్ని వైపుల నుంచి అతడు చిక్కుల్లో పడతాడు.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (జూన్ 20) ఎపిసోడ్ లో రాజు ఎక్కడ అంటూ లక్కీని చలపతి, లక్ష్మి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. తనకూ తెలియదని, చాలా రోజులుగా మాట్లాడలేదని, ఫోన్ చేసినా తీయడం లేదని లక్కీ చెబుతాడు. కావాలంటే చూడండి అంటూ తన ఫోన్ చూపిస్తాడు.

అప్పుడే రాజు అతనికి కాల్ చేయడంతో అది చూసి చలపతి, లక్ష్మి షాక్ తింటారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అంటూ చలపతి హుకుం జారీ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావ్ రా.. ఈరోజు పార్టీ ఉందని చెప్పాను కదా.. త్వరగా వచ్చెయ్ అని చెప్పి రా...