భారతదేశం, జూన్ 2 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గదిలో ఇందుపైకి రొమాంటిక్‌గా వెళ్లిన రాజు ఐ లవ్యూ చెబుతాడు. ముద్దు పెట్టుకునేందుకు దగ్గరిగా వెళ్లి వెనక్కి వచ్చి నవ్వుతాడు. ఏంటీ కంగారుపడ్డావా. నీలో భయం చూడాలనే ఇలా చూశా. పోయి పోయి నీతో కమిట్ అవ్వడానికి నేనేమైనా తింగరోన్నా. ప్రాణం పోతుందన్నా నా క్యారెక్టర్ చంపుకోను. ఇంత భయం ఉన్నదానివి నన్నెందుకే ఆట పట్టిస్తుంటావ్ అని రాజు అంటాడు.

నా మీద చేయి వేస్తే చేయి ఇరగొట్టేద్దాన్ని అని ఇందు అంటుంది. దాంతో రాజు కౌంటర్స్ వేస్తారు. నువ్వు గయ్యాలి కాదు అంతకుమించి అని రాజు అంటాడు. ఏది నా మీద చేయి వెయ్యి అని ఇందు అంటే.. నేను ఆడోళ్ల మీద చేయి వేయను. నా క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది అని రాజు అంటాడు. తర్వాత ఉదయం ఆఫీస్ ఉంది, త్వరగా వెళ్లాలి అని ఇందు అంటుంది. బెడ్ చూస్తూ...