భారతదేశం, జూన్ 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లిదండ్రలకు డెలివరీ బాయ్ కాకుండా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నట్లు అబద్ధం చెప్పి బయటకు వస్తాడు వెంకీ. బైక్ అస్సలు స్టార్ట్ కాదు. బైక్ ఏంటీ హ్యాండ్ ఇచ్చిందని వెంకీ అనుకుంటాడు. వెంకీ బాస్ కాల్ చేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నావా. జాబ్‌లో జాయిన్ అయిన రోజే లేట్ వస్తావా. త్వరగా రా.. చాలా ఆర్డర్స్ ఉన్నాయని అరుస్తాడు.

మరోవైపు ఇంద్రావతి మీరేనా అని ఇందుకు కొరియర్ ఇస్తాడు డెలివరీ బాయ్. అదేంటో చూస్తుండగా.. అది చదివేద్దామనే చూస్తున్నావా అని రేఖ, అంతా వచ్చి అంటారు. భూషణ్‌ను చూడమంటుంది రేఖ. అది చూసిన భూషణ్ షాక్ అయి.. మనకు రా మెటీరియల్ పంపేవాళ్లు నోటీస్ పంపారు. 3 నెలలుగా డబ్బు చెల్లించట్లేదు. వెంటనే డబ్బులు క్లియర్ చేయాలని, లేకుంటే రా మెటీరియల్ ఆపేస్తున్నట్లు ఉందని చెబుత...