భారతదేశం, అక్టోబర్ 31 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడు అని భర్తతో కుయిలి అంటుంది. విడాకులు ఇస్తే సరిపోదు వాడి ఆస్తి కూడా రావాలి అని కుయిలి భర్త అంటే.. ముందు విడాకులు ఇస్తే తర్వాత ఆస్తి దానంతట అదే వస్తుందని కుయిలి అంటుంది. ఇంతలో సూట్‌కేస్‌తో రాహుల్ వస్తాడు.

అది చూసి కుయిలి షాక్ అవుతుంది. ఇంట్లో మన ప్రేమను ఒప్పుకోవట్లేదు. అందుకే వాళ్లతో తెగదెంపులు చేసుకుని వచ్చాను అని రాహుల్ అంటాడు. వీడేంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. ఆస్తి లేకపోతే నువ్వేందుకు నాకు అని మనసులో అనుకుంటుంది కుయిలి.

పెళ్లయి పాప ఉన్నాక కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకొంటానంటే ఎవరు ఒప్పుకోరు. దానికే తెగదెంపులు చేసుకుని వస్తావా. నాకు కోట్ల ఆస్తి ఉండి కూడా అమ్మనాన్న లేరు. నాకు ఉంది మావయ్య ఒక్కరే. పెళ్లి చేసుకుంటే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అ...