భారతదేశం, సెప్టెంబర్ 26 -- బ్యాంకులకు వెళ్లి ప్రత్యక్షంగా లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్న వినియోగదారులు నేడు (సెప్టెంబర్ 26) బ్యాంకులకు సెలవు అని గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ప్రతినెల రెండో, నాల్గవ శనివారాల్లో బ్యాంకులకు అధికారికంగా వారంతపు సెలవు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు నేడు పనిచేయవు.

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వరుసగా 5 రోజులు బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చాయి.

రేపు ఆదివారం (సెప్టెంబర్ 27) సాధారణ సెలవు దిన...