భారతదేశం, మార్చి 27 -- మీ బ్యాంకు మీ సమస్యను పరిష్కరించడం లేదా? లోన్ విషయంలో కానీ, క్రెడిట్ కార్డు ఛార్జీల విషయంలో కానీ మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? అయితే వెంటనే ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసేయాలని అనుకుంటున్నారా? కాస్త ఆగండి! బ్యాంకు ఫిర్యాదుల పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పక్కా పద్ధతిని రూపొందించింది. ఆ ప్రక్రియను అనుసరించకుండా నేరుగా ఆర్‌బీఐని ఆశ్రయిస్తే మీ ఫిర్యాదు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFCs), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్.. ఇలా ఏ ఆర్థిక సంస్థపై ఫిర్యాదు చేయాలన్నా ఆర్‌బీఐ సూచించిన ఈ 3 అంచెల విధానాన్ని పాటించడం తప్పనిసరి.

మీకు ఏ బ్యాంకుతో సమస్య ఉందో, ముందుగా ఆ బ్యాంకులోనే ఫిర్యాదు చేయాలి. సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకునే అవకాశం సదరు సంస్థకు కల్...