భారతదేశం, అక్టోబర్ 11 -- ఆఫ్రికా దేశమైన జిబౌటి తీరంలో చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదంలో 109 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. మృతుల్లో 15 మంది చిన్నారులు (తొమ్మిది మంది బాలికలు, ఆరుగురు బాలురు), 52 మంది పురుషులు, 42 మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ 8-9 మధ్యరాత్రి వేళ జరిగిన ఈ ప్రమాదంలో మరో 116 మంది గల్లంతైనట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) వెల్లడించింది.

జిబౌటిలోని ఒబోక్ పట్టణానికి ఉత్తర దిశలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 305 మంది ప్రయాణికులతో జిబౌటి నుంచి యెమెన్ బయలుదేరిన బోటు సముద్రంలో మునిగిపోవడంతో ఈ విపత్తు సంభవించింది. బోటులోని ప్రయాణికుల్లో 80 మందికి పైగా సురక్షితంగా బయటపడగా, వారిలో ఎక్కువ మంది ఇథియోపియా దేశస్థులే ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) బృందాలు జిబౌటి అధికారులతో కలిసి ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టా...