భారతదేశం, సెప్టెంబర్ 11 -- సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మోరీ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన సంచలన ఘటనను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన 11 రోజుల వ్యవధిలోనే మిలటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కస్టడీలోకి తీసుకున్న నలుగురిలో ఒకరు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఆయుధాలను దొంగిలించడం, అక్కడ నుంచి తరలించడం, దాచిపెట్టడంలో వీరి పాత్రలపై పోలీసులు, మిలటరీ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.

ఈ సంచలన చోరీ వెనక ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో ఆధారాలు లభించాయి. తన పూర్వపు ...