భారతదేశం, సెప్టెంబర్ 3 -- హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మిలిటరీ స్థావరం భద్రతా లోపాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బొల్లారంలోని 20వ మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీ స్థాయిలో ఆయుధాలు చోరీకి గురికావడం, ఆ మరుసటి రోజే ఆర్మీ క్యాంప్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో భారీగా డిటోనేటర్లు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు తెలంగాణ పోలీసులు, కేంద్ర మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి.

ఆగస్టు 30 రాత్రి నుంచి ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉన్న ఆర్మరీ (ఆయుధాల నిల్వ గది) తాళాలను అగంతకులు విరగ్గొట్టి, లోపలికి ప్రవేశించారు. 4 ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ...