భారతదేశం, సెప్టెంబర్ 11 -- Bollarum Madras Regiment Theft Case : సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ నుంచి భారీ స్థాయిలో తుపాకులు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి పాల్పడిన విశ్రాంత ఆర్మీ హవిల్దార్‌ను సెప్టెంబర్ 11న ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

బొల్లారం పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఎస్‌ఓటీ (SOT) బలగాలు సంయుక్తంగా ఈ నిఘా ఆపరేషన్‌ను చేపట్టి నిందితుడిని పట్టుకున్నాయి. అరెస్ట్ అయిన నిందితుడిని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డి పల్లికి చెందిన ఉప్పుతోళ్ల మల్లేష్ (37)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో హవిల్దార్‌గా పనిచేసి ఉ...