భారతదేశం, మే 9 -- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితురాలికి జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మీ 'బేటీ బచావో' అనేది కేవలం ఒక నినాదానికే పరిమితమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్తరఫ్ ఎప్పుడు చేస్తారో చెప్పాలి అన్నారు. కేంద్రమంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. లేక బండి సంజయ్, ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అని అడిగారు. నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? లేదా ఆయనను మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేస్...